ఏపీకి చెందిన విశాఖపట్నం రూలర్, ఈస్ట్ గోదావరి జిల్లాల నుంచి గంజాయిని అక్రమంగా.. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ ,రాజస్థాన్ ,మహారాష్ట్ర ,హర్యానా రాష్ట్రాలకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. వారి వద్ద నుంచి 900 కిలోల గంజాయి ఐదు సెల్ ఫోన్లు డీసీఎం వాహనం మూడువేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు వెల్లడించారు.
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వారు గతంలో కూడా గంజాయిని అక్రమంగా తరలించినట్లు విశాఖపట్నం జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని మహేష్ భగవత్ తెలిపారు.. మన రాష్ట్ర సరిహద్దులలో టోల్ గేట్లు చెక్ పోస్ట్లు బార్డర్ల వద్ద వాహనాలను అప్పుడప్పుడు సర్ప్రైజ్ చెకింగ్ చేస్తున్నామని.. ఇంటెలిజెన్స్ పోలీసుల పక్క సమాచారంతో ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నట్టు తెలిపారు. గంజాయి నిందితులు ఎవరికి అనుమానం రాకుండా కొబ్బరి బోండాల మధ్యలో గాంజాయ్ ప్యాకెట్లను పెట్టి తరలిస్తుండగా గంజాయిని పట్టుకున్నామని సిపి వెల్లడించారు. వీరిపై అవసరమైతే పిడి యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామని పేర్కొన్నారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్.