తెలంగాణలో మంత్రి,ఎంపీకి షాకిచ్చిన పోలీసులు!

ములుగు జిల్లాలో అధికార పార్టీ మంత్రికి, ఎంపీకి పోలీసులు షాకిచ్చారు. వారిద్దరినీ పోలీసులు అడ్డుకున్నారు.  ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత పర్యటన నిమిత్తం వెళ్లారు. అయితే మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు వారిని వెనక్కు వెళ్లిపోవాల్సింది గా కోరారు.

అయితే ప్రస్తుతానికి మంత్రి, ఎంపీ పోలీస్ స్టేషన్ లోనే కూర్చున్నారు. నిజానికి గత కొద్దీ రోజులుగా తెలంగాణ లో మావోయిస్టు ల మూమెంట్ పెరిగింది. ఒకరకంగా వాళ్ళ బలం పెరిగిందనే వాదన కూడా వినిపిస్తోంది.  ఆ మధ్య టీఆర్ ఎస్ నేతను పొడిచి చంపడం కూడా కలకలం రేపింది. ఈ క్రమంలో నేవీరిని ఆ మండలాల్లో పర్యటనకు వెళ్లవద్దని పోలీసులు చెప్పి ఉండవచ్చని అంటున్నారు.