తెలంగాణకు వర్షసూచన….ఈరోజు,రేపు….!

తెలంగాణలో ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతం లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణా లో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో గాలులతో కూడిన ఉపరితల ఆవరతనం 3.1కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. దాంతో తూర్పు, ఆగ్నేయ భారత ప్రాంతాల నుండి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పటికే తెలంగాణ లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా హైదరాబాద్ తో పాటూ తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక నగరంలో కురుస్తున్న వర్షాలతో ట్రాఫిక్ జామ్ సమస్యలు తెలెత్తుతున్నాయి. ఇక మరో రెండు రోజులు వర్ష సూచన ఉండటం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.