తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విపరీతంగా ఎండలు కొడుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రతి ఒక్క చోట నమోదు అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందింది.
భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు ఉపసంహణం కలిగించేలా ఎల్లుండి నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురువనున్నాయి. ఏడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు అలాగే మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.