కరోనా వైరస్ నేపధ్యంలో తెలంగాణా సర్కార్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ సమీక్షలు నిర్వహిస్తుంది. మంగళవారం మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అయింది. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమైన మంత్రి వర్గ ఉపసంఘం,
ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపై చర్చించింది. ఈ భేటీలో మంత్రులు ఈటెల రాజేంద్ర, కేటిఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావు సహా పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నేపధ్యంలోనే కరోనా అవగాహన కోసం పోస్టర్ ని విడుదల చేసారు. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో హోర్డింగ్ లను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.