TELANGANA : ఆర్టీసీ ఛార్జీల పెంపు పై నేడు కీల‌క భేటీ..!

-

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకునే దిశగా నేడు రవాణా మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వ‌హించారు. పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్​.. గడిచిన నెలలోనే సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. అయితే ఏ మేరకు పెంచాలనే అంశంపై కసరత్తు చేయాలని కూడా సూచించిన‌ట్టు తెలుస్తోంది. కాగా ఈ అంశంపై ఇవాళ రవాణాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్షస‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.

సమీక్ష లో చార్జీల పెంపుపై తెలంగాణ ఆర్టీసీ క‌స‌ర‌త్తు చేయ‌నుంది. కిలోమీటర్ కు 15 నుంచి 30పైసలు పెంచాలని ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. స‌మావేశం అనంత‌రం దీనిపై ప్రభుత్వానికి ఆర్టీసి నివేధిక‌ను స‌మ‌ర్పించ‌నుంది. వచ్చే కేబినెట్‌లో చార్జీల పెంపు నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ధ‌ర‌లు పెంచితే ప్రయాణీకులపై వెయ్యి కోట్ల భారం ప‌డే అవ‌కాశ‌మున‌ట్టు తెలుస్తోంది.పెరుగుతున్న డీజిల్‌ ధరల భారం నుంచి బయటపడాలంటే చార్జీల పెంపు అనివార్యం అని ఆర్టీసీ భావిస్తోంది. ఇక ఇప్పటికే కేంద్రం డీజిల్ పై పది రూపాయలు తగ్గింపు చేయ‌గా దాని ద్వారా ఆర్టిసి కి ప్రతి రోజు 60 లక్షల ఆదా అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news