తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతోంది. అయితే.. తాజాగా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హెచ్చరిక జారీ చేశారు. ఆర్టీసీ జరుగుతున్న ప్రమాదాలను తీవ్రంగా గమనించిన అద్దెబస్సు డ్రైవర్ లకు హెచ్చరించారు చైర్మన్ బాజిరెడ్డి. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు హైదరాబాదులోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలలో శిక్షణ పొందవలసిందిగా హెచ్చరించారు.
వరంగల్ శిక్షణ కేంద్రం లో వారి డ్రైవింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని… లేదంటే టిఎస్‌ఆర్‌టిసి భారీ జరిమానాలు విధించడానికి వెనుకాడదని స్పష్టం చేశారు చైర్మన్ బాజిరెడ్డి. ప్రైవేట్ అద్దె బస్సు యజమానులు తమ మార్గాలను సరిదిద్దకుంటే వారితో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడానికి కూడా వెనుకాడబోమని టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్ వా ర్నింగ్ ఇచ్చారు. డ్రైవర్లు అతివేగంతో ప్రయాణీకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి డ్రైవర్లను వెంటనే గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాలని చైర్మన్ బాజిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.