అందరూ భావిస్తున్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో రేపటి నుంచి అన్ని విద్యా సంస్థలను మూసి వేస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు కాబట్టి స్కూల్స్ మూసి వేయాలని కోరుతున్నారని అందుకే రాష్ట్రంలో కరోనా వ్యాధి అరికట్టడం కోసం రేపటి నుంచి స్కూల్స్ మూసివేస్తున్నామని ప్రకటించారు. వాటికి అనుబందంగా ఉన్న అన్నీ హాస్టల్స్ …కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించారు.
గతంలో మాదిరిగానే ఆన్లైన్ క్లాస్ లు ఉంటాయని ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. తెలంగాణలో ఫిబ్రవరి ఒకటి నుంచి 9 ఆ పై తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభం కాగా ఫిబ్రవరి 24 నుంచి 6,7,8 తరగతుల వారికి కూడా క్లాసులు ప్రారంభం అయ్యాయి. ఇక వైద్య కళాశాలలు మినహాయించి మిగతా అన్ని రకాల పాఠశాలలు ,కళాశాలలకు వర్తిస్తుందని అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేసిన సంధర్భంలో తెలంగాణలో కూడా విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేస్తున్నామని ఆమె ప్రకటించారు.