అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన ఇంటర్ బోర్డ్

తెలంగాణా రాష్ట్ర ఇంటర్మీడియట్‌ కాలేజీలకి అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదలైంది. జూనియర్‌ కాలేజీల అకడమిక్‌ క్యాలెండర్‌ ను తెలంగాణ ఇంటర్‌ బోర్డు కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. విద్యాసంవత్సరం మొత్తం పనిదినాలు 182 రోజులుగా ఈ అకడమిక్‌ క్యాలెండర్‌ లో పేర్కొన్నారు. ఇక తెలంగాణా ప్రజలు పెద్ద పండుగలుగా భావించే దసరాకు 3 రోజులు, సంక్రాంతికి 2 రోజులు మాత్రమే సెలవులు ఇస్తున్నట్టు అకడమిక్‌ క్యాలెండర్‌ లో పేర్కొన్నారు.

వచ్చే ఏడాది మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షల నిర్వహించనున్నారు. ఇక అకడమిక్‌ ఇయర్‌ లాస్ట్‌ వర్కింగ్‌ డే 2021 ఏప్రిల్‌ 16 అని పేర్కొన్నారు. అయితే ఎప్పటి నుండి కాలేజ్ లకి డైరెక్ట్ గా హాజరవ్వాలనే అంశం మీద క్లారిటీ రావలసి ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ నేటి నుండి ప్రారంభం అయ్యాయి. పనిదినాలు తగ్గుతున్న నేపథ్యంలో ఇంటర్ సిలబస్ ని తగ్గించాలా ? తగ్గిస్తే ఏ పాఠ్యాంశాలను తొలిగించాలి ఎంత మేరకు తగ్గించాలి అనే దానిపై ఇంటర్ బోర్డ్ కమిటీలు వేసింది. అయితే ఆ కమిటీలు రిపోర్ట్ ఇవ్వగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు ఇంటర్ బోర్డు అధికారులు.