ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి..!

-

ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేల్ బాలాజీ(42) మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం వడివేల్ బాలాజీకి గుండెపోటు రావడంతో ఆయనను చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. గత 15 రోజులుగా వైద్యులు ఆయనకు చికిత్సనందించారు. అయితే ఆర్థిక స్థోమత బాగోలేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాజాగా ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం చెన్నైలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.  ఇక వడివేల్ బాలాజీ ఫ్యామిలీ విషయానికొస్తే.. భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

అధు ఇడు ఎడు, కలకపోవతు యారు వంటి టెలివిజన్‌ షోలతో వడివేల్‌ బాలాజీ పాపులర్‌ అయ్యారు.. వడివేలును ఆయన బాగా అనుకరించేవాడు.. అందుకే బాలాజికి వడివేల్ బాలాజీ అనే పేరు వచ్చింది. చిన్న వయస్సులోనే బాలాజీ అకస్మికంగా మృతి చెందడంతో తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news