తెలంగాణ లో దేశంలో లేని క్రీడా పాలసీని తీసుకొస్తారంట..!

-

దేశంలో లేని క్రీడా పాలసీని రాష్ట్రంలో తీసుకువస్తామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మామూలు స్థాయి నుంచి వచ్చిన ధ్యాన్​చంద్… ఒలింపిక్స్​లో బంగారు పథకాలు సాధించాడని మంత్రి కొనియాడారు. సామాన్యుడు పట్టుదలతో ఆడితే ఏదైనా సాధిస్తాడనడానికి ఉదాహరణ ధ్యాన్​చంద్ అని వివరించారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు వ్యాయామం అత్యంత ముఖ్యమని సూచించారు.


కరోనా కారణంగా ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల వేడుక వర్చువల్​గా జరిగింది. హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్టప్రతి రామ్​నాథ్ కోవింద్ పాల్గొని అవార్డులు అందజేశారు. అత్యున్నత పురస్కారం ఖేల్​రత్నతో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్​చంద్ అవార్డుల్ని క్రీడాకారులు అందుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version