గో రక్షణ కోసం స్వయంగా రంగంలోకి దిగుతా: రాజాసింగ్‌

-

గో రక్షణ కోసం స్వయంగా రంగంలోకి దిగుతానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. బుధవారం రోజున ఆవులను అక్రమంగా తరలిస్తున్న నలుగురు తమిళనాడుకు చెందిన వ్యక్తులను సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నా విషయం తెలిసిందే. కంటైనర్‌లో ఊపిరాడక 16 ఆవులు మృతి చెందినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై రాజా సింగ్ స్పందించారు.

ఆవులు, ఎద్దులు, దూడలను అక్రమంగా తీసుకెళ్లి బలి ఇస్తే అరెస్ట్ చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందని.. సుప్రీం కోర్టు తీర్పును గౌరవించే బాధ్యత ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు ఆవులను తీసుకువస్తున్న వాహనాలను పోలీసులు విడిచిపెడుతున్నారని విమర్శించారు. ఇక గో రక్షణ కోసం స్వయంగా తానే రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. మరోవైపు హిందూ కార్యకర్తలకు ఫోన్ చేసి పోలీసులు బెదిరిస్తున్నారని తెలిపారు. బక్రీద్ పండుగ వస్తుంది కాబట్టి మిరెవ్వరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news