తెలంగాణ మందుబాబులకు ఊహించని షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. త్వరలోనే తెలంగాణలో బీర్ల ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కూడా వచ్చే నెల నుంచి కొత్త ధరలు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చేనెల అంటే సెప్టెంబర్ నుంచి ఒక బీరు ధర.. పది రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను… రెండు సంవత్సరాలకోసారి ప్రభుత్వం పెంచనుంది. ఇందులో భాగంగానే త్వరలోనే బిళ్ళ ధరలు పెరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు… తెలంగాణ ఆదాయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త తగ్గింది. దీంతో మద్యం ద్వారా కూడా ఎక్కువగా లాభం అర్జించాలని రేవంత్ రెడ్డి సర్కార్… ఆలోచన చేస్తోంది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత ఒక్కో బీరుపై 20 రూపాయల వరకు ధర పెరిగే ఛాన్స్ ఉంది.