నామినేటెడ్ పదవుల పంపకంలో కొత్త స్టాటజీ ఫాలో అవుతున్న చంద్రబాబు..

-

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మూడు పార్టీల నేతలు నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు.. పార్టీకి చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావడంతో.. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.. భర్తీ లేట్ అవుతుందని కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి చేస్తూ ఉండటంతో దీనిపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది.

ఇప్పటికే నామినేటెడ్ పదవుల భర్తీ పైన చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు.. సుదీర్ఘంగా చర్చించి ఒక స్టేటజికి రావాలని నిర్ణయించుకున్నారట.. ఇప్పటికే మండల స్థాయి నుంచి పార్టీ కోసం పనిచేసే నేతల జాబితాను సైతం తెప్పించుకున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.. కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు నిర్వహించే గ్రీవెన్స్ లో కూడా.. అత్యధికంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు వస్తున్నాయని చంద్రబాబు దృష్టికి వెళ్ళింది.. ఈ క్రమంలో వారి నుంచి దరఖాస్తు తీసుకుని.. ఐవిఆర్ఎస్ సర్వే ద్వారా వారి గురించి వివరాలు తీసుకుంటున్నారట..

ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా టికెట్లు త్యాగం చేసిన నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల కోసం సీటు త్యాగం చేసిన నేతలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

టిడిపి గెలిచిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, బిజెపికి 10 శాతం చొప్పున పదవులు పంపకాలు చేయాలని మూడు పార్టీలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… ఫైనల్ గా ఐవిఆర్ఎస్ సర్వే ఫీడ్ బ్యాక్ ఆధారంగా పదవులు కట్టబెట్టాలని అధిష్టానం భావిస్తుందని పార్టీలో చేర్చి నడుస్తోంది.. మొత్తంగా చంద్రబాబు నాయుడు కొత్త స్టేటజి తో నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టబోతున్నారన్నమాట..

Read more RELATED
Recommended to you

Latest news