మొత్తం 175 సీట్లలో విజయం సాధించుటలో భాగంగానే అభ్యర్థుల మార్పు -ఆదిమూలపు సురేష్

-

మొత్తం 175 సీట్లలో విజయం సాధించి మరోసారి తమ పార్టీ అధికారంలోకి రావడం కొరకై మా యొక్క అభ్యర్థులను మారుస్తున్నామని ఆదిమూలపు సురేష్ తెలిపాడు. గతంలో 29 నియోజకవర్గాలకు గాను 28 నియోజకవర్గాలలో ఎస్సి అభ్యర్థులు గెలిచారని ఈసారి 29 ఎస్సి నియోజకవర్గాలలో మొత్తం తమ అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నాడు. చంద్రబాబు కొన్ని వార్త పత్రికలని మరియు న్యూస్ ఛానల్స్ ని అడ్డుపెట్టుకొని విష ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో చంద్రబాబు పార్టీలో గెలిచిన 23 ఎమ్మెల్యేలు తమ పార్టీలో నుండి వెళ్లి పోయిన అభ్యర్థులేనని ….. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు దొరకక పోటీ చేయలేదని ఆది మూలపు సురేష్ తెలిపాడు.

ఆయన పోటీ చేసే చంద్రగిరి నియోజకవర్గ స్థానం నుండి కుప్పం నియోజకవర్గంకి ఎందుకు మారారో తెలపాలని ప్రశ్నించాడు. పలు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన అన్నాడు చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నాడని అన్నాడు. చంద్ర బాబుకి 175 స్థానాలలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version