అప్పుడు ఎవ్వడు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు.. 24 ఏళ్ల కిందట పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించామని.. అప్పుడు ఎవ్వడెవ్వడు ఎవరెవరి బూట్లు మోసారో మీకు తెలుసు..? కోడంగల్ కు రా అని ఒకడు.. గాంధీ బొమ్మ కాడికి రా ఒకడు సవాల్ చేస్తున్నారు. గంజి కేంద్రం పెడతామంటే గుంజి కొడతామనే విధంగా పాలమూరును తయారు చేశాం. పాలమూరులో ఎంతో మంది మంత్రులు అయ్యారు.. 5 మెడికల్ కాలేజ్ లు తెచ్చింది నీరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లకే దక్కుతుందని ఆ ఘనత.
కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది పాలమూరు నుంచి మంత్రులుగా చేశారు. కానీ ఏ మంత్రి కూడా ఇలా మెడికల్ కాలేజ్ తేలేదు. వలసల వనపర్తిని వరిపంటల వనపర్తిగా మార్చింది ఎవరు అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ముస్లింలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలమూరు అభివృద్ధిని అడ్డుకుందని తెలిపారు. రైతులకు ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఏ సర్కారోడు కానీ రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వలేదు.