రోజ్ గార్ మేళాలో రికమెండేషన్లకు తలొగ్గకుండా నియామక పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. తాజాగా ఆయన రోజ్ గార్ మేళా లో ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ ట్రాన్సాక్షన్ లో ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. దేశానికి అవసరమైన డిఫెన్స్ ఇక్విప్ మెంట్ ఇక్కడే తయారు చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు.
మరో వైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. తెలంగాణలో హీరో అల్లు అర్జున్ ఘటన పై ప్రభుత్వం రాజకీయం చేస్తోందన్నారు.