6 రోజుల్లో 1.92 లక్షల TSSPDCL యాప్‌ డౌన్‌లోడ్స్‌ .. 2.5 లక్షల మంది బిల్లుల చెల్లింపు

-

విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు ఎక్కువ మంది టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ యాప్‌ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. కరెంట్ బిల్లు కట్టేందుకు థర్డ్ పార్టీ యాప్స్ వంటి యూపీఐ యాప్స్ గూగుల్ పే, ఫోన్ పే వంటివి వాడొద్దని ఇటీవలే ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారులు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ నెలలో శనివారం నాటికి 1.92 లక్షల మంది ఈ యాప్ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. శనివారం ఒక్కరోజే 70వేల డౌన్‌లోడ్స్‌ నమోదయ్యాయి.

నగరంలో దాదాపుగా 80 శాతం వరకు బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నారని విద్యుత్ అధికారులు తెలిపారు. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, బిల్‌ డెస్క్‌ వంటి థర్డ్‌ పార్టీ పేమెంట్‌ యాప్స్‌ ద్వారా గతంలో చెల్లించేవారు. వీటిలో కొన్ని ఆర్‌బీఐ నిబంధనల మేరకు భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌తో ఎనేబుల్‌ చేసుకోకపోవడంతో.. వాటిలో నేరుగా చెల్లించవద్దని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ సూచించింది. దీంతో ఐదు రోజులుగా డిస్కం యాప్‌ను పెద్ద సంఖ్యలో ఉపయోగించడం మొదలెట్టారు. దీని ద్వారా 2.5 లక్షల మంది బిల్లులు చెల్లించారని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version