మణికొండలో కేవ్‌ పబ్‌పై టీజీ న్యాబ్ అధికారుల దాడులు

-

రాష్ట్ర రాజధానిలో డ్రగ్స్ వినియోగం, సరఫరాపై యాంటీ నార్కోటిక్‌ పోలీసులు దృష్టి సారించారు. మత్తు వాడకంపై ఉక్కుపాదం మోపాలని ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా విద్యార్ధులు మత్తు పదార్ధాలకు అలవాటవుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు వారిపై నిఘా పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు పబ్లపైనా ప్రత్యేక ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ మణికొండలోని కేవ్ పబ్‌లో టీజీ న్యాబ్ అధికారులు, రాయదుర్గం ఎస్‌వోటీ పోలీసులు సోదాలు చేశారు. పబ్‌లో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమాచారంతో ఆకస్మిక దాడులు చేశారు. 50 మందిని అదుపులోకి తీసుకొని వారికి పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అందులో 24 మంది మాదకద్రవ్యాలు స్వీకరించినట్లు నిర్ధరణ అయిందని వెల్లడించారు. డీజే ఆపరేటర్‌తో కలిసి పబ్‌ నిర్వాహకులు డ్రగ్స్‌ అమ్మినట్లు గుర్తించారని పేర్కొన్నారు. అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని నేడు కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version