తెలంగాణలో బీసీ కుల వృత్తుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం పంపిణీని రేపటి నుంచే ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ రావు ప్రకటించారు. ఈ మేరకు ఆ సాయం పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ పథకాన్ని గత నెలలో సీఎం ప్రారంభించిన తర్వాత తొలివిడత కింద ఈ నెల 15న నియోజకవర్గానికి 50 కుటుంబాల చొప్పున సాయం అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం కోసం.. బీసీ కార్పొరేషన్‌కు ఈ ఏడాది బడ్జెట్‌లో ఇచ్చిన రూ. 300 కోట్లకు అదనంగా మరో రూ.200 కోట్ల ను ప్రభుత్వం మంజూరు చేసింది. తొలివిడత కింద ఈ నెల 15న దాదాపు రూ.50-60 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశాలున్నట్లు తెలిసింది.