బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. కులవృత్తులు చేసుకునే బీసీలు, ఎంబీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎలాంటి పూచికత్తులు లేకుండా ఆయా కుటుంబాలకు రూ.లక్షను పూర్తి సబ్సిడీతో అందించే పథకానికి విధివిధానాలను ప్రకటించనుంది.
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 9న తొలి విడత పంపిణీని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 1200 నుంచి 1500 మందికి లబ్ధిని చేకూర్చేందుకు ఉపసంఘం కసరత్తు చేస్తోంది.
ఇక అటు గీత కార్మికులకు రైతు భీమా తరహాలో లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. తాటి, ఈతకల్లు గీస్తున్న కార్మికుల వివరాలను సేకరించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ అన్ని జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ లకు ఆదేశాలు జారీచేశారు. ఈనెల 30లోగా గీత కార్మికుల ఆధార్, నామినీల వివరాలు పంపాలని ఆదేశించారు. ఒకవేళ గీత కార్మికులు చనిపోతే బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేస్తారు.