మునుగోడు ఉప ఎన్నిక తరుముకు వస్తున్న నేపథ్యంలో… ఆ నియోజకవర్గంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకున్నందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ప్రధాన పార్టీలు అయిన టిఆర్ఎస్, కాంగ్రెస్ మరియు బిజెపిలు తమ తమ పార్టీల అభ్యర్థిలను ప్రకటించేసాయి.
ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం లో కొత్త ఓటర్ల వివాదం నెలకొంది. మునుగోడులో ఉప ఎన్నికలు వస్తాయన్న ప్రచారం మొదలైన నాటి నుంచి దరఖాస్తులు మొదలయ్యాయి. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఇక్కడ ఓటు కోసం నమోదు చేసుకున్నారు. ఎన్నికల సంఘం కొత్త ఓటరు నమోదుకు ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తోంది. దాన్ని అవకాశంగా చేసుకొని మునుగోడు నియోజకవర్గంలో ఓటర్లు పెద్ద ఎత్తున కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. వాటిని పరిశీలిస్తున్న అధికారులు అనర్హులకు ఓటు తిరస్కరిస్తున్నారు. ఇప్పటివరకు 10వేలకు పైగా ఓట్లు తొలగించినట్లు సమాచారం.