రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కావాలనే సీఎం రేవంత్ రెడ్డి జల వివాదాలు సృష్టిస్తున్నారని ఏపీ బీజేపీ సీనియర్ నేత విష్ణువర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం దోచేస్తుందంటూ సీఎం రేవంత్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల ఆంధ్రా ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలు తమ హక్కు అని.. మా నీళ్లు మేము వాడుకుంటే అందులో దోపిడీ ఏముందని ప్రశ్నించారు.
బాధ్యతయుతమైన పదవీలో ఉండి పక్క రాష్ట్రంలోని ప్రజలను, రైతులను దొంగలు అంటూ సంబోధించడం ఎంత వరకు కరెక్ట్ అని ఫైర్ అయ్యారు. తమ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తో కలుపుగోలుగా ఉంటూ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెచ్చుకుంటోందన్నారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని కామెంట్ చేశారు.