తెలంగాణ సరిహద్దులో ఉన్న 14 గ్రామాలను తమ రాష్ట్రంలో విలీనం చేయబోతున్నట్లుగా మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవన్ కులే వెల్లడించారు. ఆయా ప్రాంతాల ప్రజలు ఎప్పటినుంచో వారి ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలని కోరుతున్నట్లుగా వెల్లడించారు. జమాబంధీ రికార్డులు వారు తమ స్టేట్ లోనే ఉన్నట్లు చూపుతున్నాయని స్పష్టం చేశారు.

విలీన ప్రక్రియ ప్రారంభమైనట్లుగా వెల్లడించారు. తెలంగాణలోని రజురా, జీవాటీ తాలూకాలో ఉన్న ఈ గ్రామాలను మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో కలపబోతున్నారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి మహారాష్ట్రలో విలీనం చేయాలని కోరుతున్నామని ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తి కాబోతుందని స్పష్టం చేశారు.