తెలంగాణలో భానుడు భగ భగ మండి పోతున్నాడు. ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి భూమి చల్లబడటంతో ఎండ ఎక్కువగా కొట్టినప్పటికీ ప్రజలకు అంతగా కనిపించలేదు. ముఖ్యంగా నిన్నటి నుంచి భానుడు నిప్పులు చెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో అయితే 52.3 ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం.
తాజాగా జగిత్యాలలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తీవ్రమైన ఎండల ధాటికి 20 ద్విచక్ర వాహనాలు దగ్ధం అయిన ఘటన జగిత్యాల పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని బైపాస్ రోడ్ లో గల అన్వేష్ అనే మెకానిక్ ఇంటి ఆవరణలో ఉన్న 20 బైక్ లు ఎండ వేడిని తట్టుకోలేక పూర్తిగా కాలిపోయాయి. ఆ మంటలు కాస్త ఇంట్లోకి వ్యాపించగా ఇంట్లో ఉన్న సామాగ్రి కూడా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారుగా 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిలిందని బాధితులు తెలిపారు.