ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించిన 21 మంది కానిస్టేబుల్స్ అరెస్టు అయినట్లు అడిషనల్ డి.జీ టి.జి ఎస్పీ..సంజయ్ కుమార్ జైన్ ప్రకటించారు. హైదరాబాద్ సిటీలో బిఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కానిస్టేబుల్లు ఆందోళన నిర్వహించారన్నారు అడిషనల్ డి.జీ టి.జి ఎస్పీ..సంజయ్ కుమార్ జైన్. వీరిపై దోమలగూడ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేశామని చెప్పారు.
బిఎన్ఎస్ 223, 126 (2) సెక్షన్లతోపాటు పోలీస్ ఫోర్సెస్ యాక్ట్ సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేసిఅంట్లు వెల్లడించారు అడిషనల్ డి.జీ టి.జి ఎస్పీ..సంజయ్ కుమార్ జైన్. క్రిమినల్ కేసులతోపాటు కానిస్టేబుల్లకు షో కాజ్ నోటీసులు జారీ చేశారట. ఆర్టికల్ 311 (2(b) నిబంధనలు ఉల్లంగించారు…నిబంధనలను అతిక్రమించి ప్రవర్తిస్తే తెలంగాణ పోలీస్ శాఖ ఉపేక్షించదని చెప్పారు అడిషనల్ డి.జీ టి.జి ఎస్పీ..సంజయ్ కుమార్ జైన్. ఆందోళన కు పాల్పడుతున్న వారిపై శాఖ పరమైన చర్యలు కూడా ఉంటాయని హెచ్చరించారు.
: