బతికి ఉన్నప్పుడే మనిషి వల్ల ఉపయోగం.. చచ్చిన తరువాత ఒకరోజు కూడా ఇంట్లో పెట్టుకోరు. కానీ మొక్కలు అలా కాదు. ఏనుగు చచ్చినా బతికినా వెయ్యే అన్నట్లు..మొక్కలు బతికి ఉన్నా, నరికేసినా వాటి వల్ల ఉపయోగం అయితే ఉంటుంది. ఇంకా హైలెట్ ఏంటంటే.. అవి పరివర్తనం చెందే ప్రతి స్జేజ్ ఒక్కో విధంగా మనకు ఉపయోగపడతాయి. పత్తి మొక్కనుంచి ముందు..కాయలు..ఆపై పూలు వస్తాయి..పూల వల్ల కూడా మనకు ఎన్నో సమస్యలు నయం అవుతాయి. అలాగే దానిమ్మలో కూడా పూలు చూసే ఉంటారు. ఆ పూల వల్ల ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందవచ్చట. దానిమ్మలో విటమిన్ సి ,సిట్రిక్ యాసిడ్ ,పోటాషియం ,ఫైబర్, కేన్సర్ వ్యాధిని నిరోధించే ఆసిడ్స్ ఉన్నాయి. ఈ పూల వల్ల ఏలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దామా..!
దానిమ్మ పండుతో పాటు పువ్వు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే దృఢంగా తయారై ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందవచ్చు. అంతేకాకుండా దానిమ్మ పువ్వును మెత్తగా చేసి అలర్జీలు, కిటకాలు కుట్టిన ప్రదేశంలో రాయటం వల్ల పొక్కులు మానిపోతాయి.
- రుతువిరతి సమయంలో స్త్రీలు మానసికంగా భావోద్వేగానికి గురై చేతులు, కాళ్లు, తుంటి కీళ్ల నొప్పులకు గురవుతారు. అలాంటి సమయంలో దానిమ్మ పువ్వు కషాయం తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
- పువ్వును చూర్ణం చేసి రసాన్ని పిండుకుని ఒక ఔన్సు రసం తీసుకోవాలి. అర ఔన్సు స్వచ్ఛమైన తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.
- నీళ్ల విరేచనాలు, నోటిపూత తగ్గించడానికి ఉపయోగిస్తారు.
- సహజ యాస్పిరిన్‌గా పనిచేసి రక్తసరఫరాను వేగవంతం చేస్తుంది.
- కడుపులో గ్యాస్ ఇరిటేషన్ వల్ల కొద్దిగా తింటే కడుపు నిండిపోయి ఆకలిగా అనిపించదు. అలాంటి సమస్య ఉన్నవారు దానిమ్మ పువ్వులో తాటిబెల్లం కలిపి కషాయం చేసి తాగితే చికాకు తగ్గుతుంది.
- మలబద్ధకం సమస్య ఉన్నవారు కూడా పువ్వలతో కషాయం చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.