అయ్యప్ప భక్తులకు శుభవార్త…శబరిమలకు మరో 22 ప్రత్యేక రైళ్లు

-

అయ్యప్ప భక్తులకు శుభవార్త…శబరిమలకు మరో 22 ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం డిసెంబర్, జనవరిలో 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Train accident in AP
Big alert for train passengers in AP

సికింద్రాబాద్-కొల్లం, సికింద్రాబాద్-కొట్టాయం, కాకినాడ-కొట్టాయంల మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెలలో 27-30 తేదీల మధ్య నాలుగు రైళ్లు, మరో 18 రైళ్లు జనవరి 3-15 వరకు రాకపోకలు కొనసాగిస్తాయి.

అటు శబరిమల అయ్యప్పస్వామి ఆలయం దర్శనం సమయం పెంచుతున్నట్లు ట్రావెన్​కోర్ దేవస్థాన బోర్డు తెలిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనం సమయాన్ని పెంచినట్లు వెల్లడించింది. మధ్యాహ్నం విడతలో 3 గంటల నుంచి రాత్రి 11 వరకు దర్శనం సమయం పెంచుతున్నట్లు ప్రకటించింది. అంటే రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు స్వామి వారిని దర్శించుకుంటుండగా తాజాగా మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభించడం వల్ల మరో గంట దర్శన సమయం పెరిగినట్లైంది.

Read more RELATED
Recommended to you

Latest news