హైదరాబాద్‌లో 25 వేల లోతైన మ్యాన్‌హోళ్లు.. బీ కేర్​ఫుల్​

-

హైదరాబాద్​లో మంగళవారం రోజున భారీ వర్షం కురిసింది. ఇవాళ, రేపు కూడా భారీ వానలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్​ఎంసీ, జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. వానలు, వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ వ్యాప్తంగా ఉన్న లోతైన మ్యాన్‌హోళ్లను ప్రజలు గుర్తించేలా జలమండలి చర్యలు చేపట్టింది.

మ్యాన్​హోళ్లు అత్యంత ప్రమాదకరమని చెప్పేలా అవి ఉన్న చోట ఎరుపు రంగును అద్దుతోంది. గ్రేటర్‌ వ్యాప్తంగా 25 వేలకు పైగా లోతైన మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. వీటిపై సేఫ్టీ గ్రిల్స్‌ ఏర్పాటు చేయడమే కాకుండా.. వాటికి ఎరుపు రంగును పూస్తూ ప్రజలను అలర్ట్ చేస్తోంది. వానాకాలం నేపథ్యంలో మ్యాన్‌హోళ్లలో పడకుండా జాగ్రత్తలతో ప్రజలను అప్రమత్తం చేస్తుంది. నగరంలోని రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్‌హోళ్లను ఎవరైనా తెరిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని జలమండలి హెచ్చరించింది. వానలు కురుస్తుండటంతో ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(ఈఆర్టీ), సేఫ్టీ ప్రొటోకాల్‌ టీమ్‌(ఎస్పీటీ) వాహనాలను సిద్ధం చేసినట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news