జీడిమెట్ల ప‌రిధిలో ఆక‌స్మాత్తుగా కుప్ప‌కూలిన పాత భ‌వ‌నం

-

ఈ మధ్య మన దేశం లో ఎన్నో చోట్ల ఎన్నో పాత కట్టడాలు భవనాలు కుప్పకూలడం చాల తరుచుగా చూస్తున్నాం. ఇలా జరగడం వాలా ఎందరో అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. కొందరికి చేతులు, కాళ్ళు ఇలా అవయవాలను కోల్పోతున్నారు. భవనాలు కూలడం వాళ్ళ ఎందరో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇలాంటి ఒక సంఘటన ఈరోజు జీడిమెట్ల ప‌రిధిలోమాచోటు చేసుకుండి. జీడిమెట్ల పరిధిలోని చెరుకుప‌ల్లిలో 40 ఏండ్ల నాటి ఓ పాత భ‌వ‌నం ఈరోజు సాయంత్రం ఆక‌స్మాత్తుగా కుప్ప‌కూలిపోయింది. ఆ పాత భ‌వ‌నానికి మ‌ర‌మ్మ‌తులు చేస్తుండ‌గా కుప్ప‌కూలిపోయిన‌ట్లు స్థానికులు సమాచారం తెలియచేశారు. ప‌క్క‌నున్న మూడు భ‌వ‌నాల‌పై శిథిలాలు ప‌డ‌టంతో గోడ‌లు దెబ్బ‌తిన్నాయి. దీంతో ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు స్వ‌ల్ప గాయాలయ్యాయి. కూలిన భ‌వ‌నంలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఎవ్వరి ప్రాణానికి ప్రమాదం లేకుండా తప్పింది. ఈ స‌మాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, ప‌రిస్థితిని స‌మీక్షించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version