ఐపీఎల్ 2023: చెన్నై జట్టులో కీలక మార్పు… వాట్ ఎ స్టెప్ ?

-

రేపటి నుండి మరో రెండు నెలల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ తమ ఆటగాళ్లతో సమరానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీకి దూరం కావడం నిరాశే అయినప్పటికీ వారి స్థానంలో కొందరు ఆటగాళ్లను భర్తీ చేసుకుని ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ స్పీడ్ బౌలర్ ముఖేష్ చౌదరి గాయం కారణముగా వైదొలగడంతో అతని స్థానంలో చెన్నై కోచింగ్ స్టాఫ్ స్పీడ్ బౌలర్ ఆకాష్ సింగ్ ను రీప్లేస్ చేసింది.

ఆకాష్ సింగ్ నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన వాడు కావడం గమనార్హం. ఇతను ఇప్పటికే ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. కానీ తన బౌలింగ్ సత్తా మాత్రం నిరూపించుకునే అవకాశం ఇంకా అందిపుచ్చుకోలేకపోయాడు. చెన్నై జట్టులో ఉన్న ఈ కుర్రాడు తన బౌలింగ్ తో సంచలనాలు సృష్టిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version