తెలంగాణను కంటి కలక సమస్య వెంటాడుతోంది. తాజాగా మంచిర్యాల జిల్లా జైపూర్ గురుకుల పాఠశాలలో 400 మంది విద్యార్థులకు కళ్ళ కలక సమస్య వచ్చింది.మంచిర్యాల జిల్లా జైపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కళ్ళ కలక కలకలం రేపుతోంది. దీంతో హాస్టల్ నిర్వహణ, ఇంచార్జి ప్రిన్సిపాల్ పై విమర్శలు వస్తున్నాయి.
అయితే.. దీనిపై హెల్త్ క్యాంప్ నిర్వహించాం మంటున్నారు ఇంచార్జీ ప్రిన్సిపల్. గత మూడు సంవత్సరాలుగా రెగ్యులర్ ప్రిన్సిపల్ లేక ఇంచార్జి ప్రిన్సిపల్ గా అతనే విధులు నిర్వహిస్తున్నాడు. ఇలాంటి తరుణంలోనే.. గురుకుల పాఠశాలలో 400 మంది విద్యార్థులకు కళ్ళ కలక సమస్య రావడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.