Hyderabad: 47 ఏళ్ల ఆంటీపై లైంగిక దాడి…హోటల్ లో రూంకు తీసుకెళ్లి!

-

పెళ్లి చేసుకుంటానని నమ్మించి 47 ఏళ్ల మహిళపై లైంగికదాడికి పాల్పడ్డడాడు 42 ఏళ్ల వ్యక్తి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బేగంపేటకు చెందిన ఓ మహిళ(47)కు ఓ వివాహ వెబ్ సైట్ ద్వారా పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు ముంబయికి చెందిన శశికాంత్ కక్కడ్(42). 2023 జనవరిలో బేగంపేటకు వచ్చిన శశికాంత్ ఓ హోటల్ లో రూం తీసుకొని మహిళపై అత్యాచారం చేసాడు.

42-year-old man sexually assaulted 47-year-old woman on the pretext of marriage
42-year-old man sexually assaulted 47-year-old woman on the pretext of marriage

ఇలా పలుమార్లు హైదరాబాద్‌కు వచ్చి మహిళపై లైంగిక దాడి చేసాడు శశికాంత్. తనకు బాగా ఆస్తి ఉందని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పి మహిళ దగ్గర మొత్తం రూ.24 లక్షలు తీసుకొని ఉడాయించాడు శశికాంత్.

బాధితురాలు పెళ్లి, డబ్బుల విషయం అడగగా.. తనను కలిసినప్పుడు తీసుకున్న ఫోటోలు వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరించాడు శశికాంత్. దీంతో బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. అత్యాచారం, మోసం కింద కేసు నమోదు చేసి శశికాంత్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news