విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు 48 రోజులు వేసవి సెలవులు..

-

తెలంగాణ  విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అదేమిటంటే, స్కూళ్లకు ఈ ఏడాది వేసవి సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూళ్లకు ఈ ఏడాది సమ్మర్ హాలిడేస్ ఉంటాయని గతంలోనే విద్యాశాఖ తెలిపింది.

మొత్తం 48 రోజుల సెలవుల అనంతరం.. తిరిగి జూన్ 12వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. 1 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు ఏప్రిల్ 12 నుంచి 20 వరకు సమ్మెటివ్-2 పరీక్షలు జరగనున్నాయి. ఇక ఏప్రిల్ 3 నుంచి 13 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుంది.అనంతరం ఏప్రిల్ 25 నుండి వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version