తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీలోకి మొత్తం ఐదు మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారని బాంబు పేల్చారు ఎన్ రామచంద్రరావు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. తమతో టచ్ లో ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించారు. అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరు అలాగే వారు పార్టీలో చేరే తేదీలను కూడా త్వరలో వెల్లడిస్తామని వివరించారు.

దీంతో రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నారు. ఇది ఇలా ఉండగా… ఇటీవల గులాబీ పార్టీకి రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు… ఈనెల 10వ తేదీన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. తన భార్యతో పాటు కార్యకర్తలను భారతీయ జనతా పార్టీలోకి తీసుకుపోతున్నారు గువ్వల బాలరాజు.