ఎన్నికల కమిషన్ కు రాహుల్ గాంధీ ఐదు ప్రశ్నలు సంధించారు. ప్రతిపక్షాలకు డిజిటల్ ఓటరు జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? సీసీటీవీ ఫుటేజ్‌లు ఎందుకు, ఎవరు చెబితే ధ్వంసం చేశారు? అని నిలదీశారు. ఓటర్ల జాబితాను ఎందుకు తారుమారు చేశారు? ప్రతిపక్ష నాయకులను ఎందుకు బెదిరిస్తున్నారు? అని ప్రశించారు.

ఈసీ ఇప్పుడు బీజేపీ ఏజెంట్‌గా మారిందా లేదా స్పష్టంగా చెప్పండి? అని ఆగ్రహించారు రాహుల్ గాంధీ. ఇక అటు రాహుల్ గాంధీవి అసంబద్ధ ఆరోపణలు.. తోసిపుచ్చింది ఎన్నికల సంఘం. ఓట్ల చోరీ జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. ఈ ఆరోపణలను ప్రస్తావిస్తూ ఓ డిక్లరేషన్‌పై సంతకం చేసి విడుదల చేయాలని రాహుల్ గాంధీకి సవాలు విసిరిన ఎన్నికల సంఘం… లేని పక్షంలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సూచించింది.