ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫోన్ చార్జింగ్ పెడుతూ 9 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో శుక్ర వారం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంటు షాక్ తగిలి 9 ఏళ్ళ బాలిక అంజలి కార్తీక మృతి చెందింది.

తడి చేతులతో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంటు షాక్ తగిలి 9 ఏళ్ళ బాలిక అంజలి కార్తీక మృతి చెందిందని స్థానికులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం స్థానిక పాఠశాలలో 4వ తరగతి బాలిక చదువుతోంది. ఛార్జింగ్ పెట్టె సమయం లో చేతులు తడిగా ఉండటమే ప్రమాదానికి కారణం అని పోలీసులు కూడా నిర్ధారించారు. దీని పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.