హైదరాబాద్ కు కేంద్ర ఏం ఇవ్వలేదు.. మేం నిధులిచ్చాం : మంత్రి పొన్నం

-

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇవాళ ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన హైదరాబాద్ అభివృద్ధికి నిధులపై మాట్లాడారు. హైడ్రా, మూసీ నది కోసం నిధులు విడుదల చేసిన సీఎం, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపి మంత్రి పొన్నం ప్రభాకర్.. కేంద్రం నుంచి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ అభివృద్ధికి నిధులు తీసుకురాలేదని అన్నారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని బీజేపీ ఎంపీలను మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. అఖిలపక్షం సమావేశం పెట్టి.. ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణకు కేంద్రం సాయం చేసే అవకాశం ఉన్నా.. చేయట్లేదని వాపోయారు. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు అడగడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవని అన్నారు. హైదరాబాద్‌కు కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుందో చెప్పాలి? అని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్న పొన్నం.. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. బీసీలకు ఎదైనా తప్పు జరిగితే బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉన్నానని.. రైతులను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news