పారిస్ ఒలింపిక్స్ 2024.. ఇవాళ్టి భారత్ షెడ్యూల్ వివరాలివే

-

పారిస్ ఒలింపిక్స్ 2024 శుక్రవారం రోజున అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అసలు ఆట ఇవాళ్టి నుంచి మొదలు కానుంది. నేడు మన భారత అథ్లెట్లు మొత్తం 7 క్రీడల్లో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్లో నేడు (జులై 27 2024) పాల్గొనబోయే భారత జట్లు వివరాలు, షెడ్యూల్ మీకోసం.

బ్యాడ్మింటన్

పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్)

మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)

పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి)

మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప)

రోయింగ్ : పురుషుల సింగిల్ స్కల్స్ హీట్స్ (బల్రాజ్ పన్వార్)

షూటింగ్

10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ అర్హత (సందీప్ సింగ్, అర్జున్ బాబుటా, ఎలవెనిల్ వలరివన్, రమితా జిందాల్)

10మీ ఎయిర్ పిస్టల్ పురుషుల క్వాలిఫికేషన్‌ (సరబ్‌జ్యోత్‌ సింగ్, అర్జున్ చీమా)

10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ రౌండ్‌లు

10మీ ఎయిర్ పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్‌ (రిథమ్ సాంగ్వాన్, మను బాకర్)

టెన్నిస్ : 1వ రౌండ్ మ్యాచ్‌లు పురుషుల సింగిల్స్ (సుమిత్ నాగల్), పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న, ఎన్. శ్రీరామ్ బాలాజీ)

టేబుల్ టెన్నిస్ : పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్), మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) ప్రిలిమినరీ రౌండ్

బాక్సింగ్ : మహిళల 54 కేజీలు (ప్రీతీ పవార్) రౌండ్ ఆఫ్ 32

హాకీ : పురుషుల గ్రూప్ బి భారత్ v న్యూజిలాండ్

Read more RELATED
Recommended to you

Latest news