ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది కారు. దీంతో గాల్లోకి ఎగిరిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ వద్ద గిరి అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది.. దీంతో గిరి 10 మీటర్లు గాల్లో ఎగిరిపడి మరణించాడు.
NTPC చౌరస్తాలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది స్విఫ్ట్ కారు. మృతుడు అన్నోజిగుడ లోని రాజీవ్ గృహకల్ప కు చెందిన గిరి (38) గా గుర్తించారు పోలీసులు. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నాడు మృతుడు గిరి. ఈ ప్రమాదం తర్వాత కారు ఆపకుండా వెళ్లాడు వాహనదారుడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున మృతి చెందాడు గిరి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.