బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిలకు ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కోకాపేటలోని సర్వే నంబర్ 85లో ఓ భూమి వివాదంలో ఉంది.
ఈ భూమికి సంబంధించి డెవలపర్లు, ఇన్వెస్టర్ల మధ్య వివాదం నడుస్తుండగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వారి అనుచరులు అక్కడ గుడిసెల్లో నివాసం ఉంటున్న కూలీలను తరిమికొట్టి భూమిని ఆక్రమించారు. దీంతో డెవలపర్లు పోలీసులను ఆశ్రయించారు.
ఇది ఇలా ఉండగా, హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై టీఎస్పీఎస్సీ కమిషన్ స్పందించినట్లు సమాచారం. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై డివిజన్ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ – 1 పరీక్ష ఇంతకుముందే ఓసారి రద్దైన సంగతి తెలిసిందే.