చంద్రబాబుపై కేసు.. ఏపీ సర్కార్ కు రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ !

-

చంద్రబాబుపై కేసు నేపథ్యంలోనే.. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన విజయవాడ ఏసిబి కోర్టు జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో పలువురు అనుచితంగా పోస్టులు పెడుతున్నారు. దీనిపై హైకోర్టు న్యాయవాది రామానుజం రాష్ట్రపతికి ఫిర్యాదు చేయగా…. AP CSకు రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పిసి మీనా లేఖ రాశారు.

జడ్జిపై అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తీసుకున్న చర్యలను తమకు తెలియజేయాలని రాష్ట్రపతి భవన్ CSను ఆదేశించింది. ఇది ఇలా ఉండగా, తన కేసులో భాగంగా సుప్రీంకోర్టు.. మెట్లు ఎక్కనున్నారు నారా చంద్రబాబు నాయుడు. క్లాస్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పున సవాల్ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మన వైపు చంద్రబాబు సీఐడీ కస్టర్డ్ ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news