చంద్రబాబుపై సీఐడీ ప్రశ్నల వర్షం ?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇక నిన్న హై కోర్ట్ చంద్రబాబు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. దీనితో సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ వేయడం జరిగింది. సోమవారం దీనిపై విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు చంద్రబాబు ను సిఐడి డీఏస్పీ ధనుంజయ్ నేతృత్వంలోని ఒక బృందం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారిస్తోంది. ఉదయం నుండి విచారణలో ఉండగా… ఇప్పుడే విచారణకు బ్రేక్ ఇచ్చారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒక గంటకు ఇద్దరు అధికారులు చంద్రబాబును విచారిస్తున్నారట. ఈ విచారణలో భాగంగా బాబును అడిగిన ప్రశ్నలను చూస్తే, సీమెన్స్ కంపెనీ కి తెలియకుండానే వారి పేరుతో MOU చేసుకున్నారా?

కాబినెట్ అనుమతి లేకుండా స్కిల్ డెవెలప్మెంట్ ఎందుకు ఏర్పాటు చేశారు ? ఇక ప్రభుత్వ అధికారులు అభ్యంతరం తెలిపినా ఎందుకు నిధులు విడుదల చేశారు ? లాంటి ఎన్నో ప్రశ్నలను చంద్రబాబు ను అడిగినట్లు తెలుస్తోంది . మరి వీటికి చంద్రబాబు ఏమి సమాధానం ఇచ్చారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.