అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఉచిత ఎల్ఆర్ఎస్ అమలుపై అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన నేపథ్యంలో.. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి, అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే… విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు అల్వాల్ డీసీ శ్రీనివాస్ రెడ్డి.
దీంతో అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు అయింది. అటు దుండిగల్ పరిధిలో మల్కాజ్ గిరి MLA రాజశేఖర్ రెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు వస్తున్నాయి. మల్కాజ్ గిరి MLA రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఇంక్లీవ్ ఎం.ఎల్.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలు ఉన్నాయని కూల్చివేతకు దిగారు అధికారులు. మల్కాజ్ గిరి MLA రాజశేఖర్ రెడ్డి కాలేజీలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు.