నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారితో సహా మరో వ్యక్తి మృతి

-

నాగర్ కర్నూల్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐపీఎస్ ఆఫీసర్ సహా మరో వ్యక్తి మృతి చెందారు. ఘటన ప్రకారం అమ్రాబాద్ మండలం దోమల పెంట గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారును ఆర్టీసీ బస్సు  ఢీ కొట్టింది. దీంతో ఇన్నోవా కారు నుజ్జునుజ్జు అయ్యింది.

ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు  లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన ప్రమాదాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తులు మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి సుధాకర్, భగవత్ లుగా గుర్తించారు. మృతదేహాలను దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ  ప్రమాదం గురించి ఇంకా పూర్తి సమాచారం అధికారులు వెల్లడిస్తే కానీ ఓ కొలిక్కి రాదు.

Read more RELATED
Recommended to you

Latest news