గణేష్ ఉత్సవాలకు ఆదిలాబాద్ సిద్ధం అయింది. ఈ నేపథ్యంలోనే… ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పూజకు 52 అడుగుల భారీ గణనాథుడు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆకట్టు కుంటుంది కుమార్ జనతా గణేశ్ మండలి వినాయకుడు. 52 అడుగుల గణేశ్ విగ్రహం తయారు చేసింది కుమార్ జనతా మండలి.
గత ఏడాది 48 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయగా ఈ సారి 52 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు చేసింది కుమార్ జనతా గణేశ్ మండలి. త్రిముఖాలతో దర్శనం ఇవ్వనున్న భారీ లంబోదరుడు… ఖైరతాబాద్ తరహాలో ముందుకు వస్తున్నాడు. ఇక అటు వినాయక చవితి సందర్భంగా ఇవాళ ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకొని మొదటి పూజను నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవ్వాళ గల్లి గల్లీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు భక్తులు.హైదరాబాద్ నగరంలో ఎన్ని బొజ్జ గణపయ్యలు ఉన్నా… ఖైరతాబాద్ బడా గణేష్ ఎంతో ప్రత్యేకంగా ఉన్న సంగతి తెలిసిందే.