అయోధ్య రాముడికి తెలంగాణ నుంచి భారీ లడ్డూ

-

Ayodhya Ram : తెలంగాణ రాష్ట్రం నుంచి అయోధ్య రామయ్యకు భారీ లడ్డూ వెళ్లనుంది. అయోధ్య శ్రీరాముడికి నేడు భారీ లడ్డు తరలి వెళ్లనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీ రామా క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం 1,265 కేజీల భారీ లడ్డును తయారు చేయించారు.

A huge laddoo from Telangana to Ayodhya Ram

ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన రోజు నుంచి ప్రాణ ప్రతిష్టకు ఎన్ని రోజులు పట్టిందో అన్ని కేజీల లడ్డును తయారు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు లడ్డు యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు.

అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తోంది. మరో 5 రోజుల్లో ఆయోధ్యలో రామ్ లల్లా కొలువుదీరనున్నాడు. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న వేళ దేశవ్యాప్తంగా భక్తులు పంపిన కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌లోని వడోదర నుంచి 108 అడుగుల పొడవు, 3వేల 403 కిలోల బరువైన బాహుబలి అగరుబత్తీ కానుకగా వచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news