Warangal : కారుపైన పడిన వడ్ల లోడు లారీ..ఒకరు మృతి

-

Warangal : కారుపైన పడిన వడ్ల లోడు లారీ..ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్ల లోడుతో వెళుతున్న లారీ…కారుపైన పడింది.

A lorry loaded with sawdust fell on a car

శనివారం అర్థరాత్రి సమయంలో ఘటన జరిగింది. ఇక ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా….పలువురికి గాయాలు అయ్యాయి. బాధితులు నర్సంపేట మండలం రామారం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మృతుడు జినుకల నాగరాజుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులు శ్రీకాంత్,సంధ్య,లలితగా గుర్తించారు. తీర్థయాత్రల కోసం వేములవాడకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version