వరంగల్‌ లో రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్య?

-

 

వరంగల్ అండర్ బ్రిడ్జ్ సమీపంలోని ఏడు మోరీల దగ్గర రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ సంఘటనలో యువతి మృతి చెందగా…. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలతో ఉన్న యువకుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు జి ఆర్ పి పోలీసులు. మృతురాలు ఖమ్మం జిల్లా సారధి నగర్ కు చెందిన సుష్మ D/O బాలాజీ గా గుర్తించారు పోలీసులు.

A loving couple attempted suicide on the train tracks in Warangal

అటు చికిత్స పొందుతున్న యువకుడు వరంగల్ కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన మేక మల్ల చెన్నకేశవS/o వెంకటేష్ 19 గా గుర్తించారు. ఈ ఆత్మహత్య యత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమా? మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. సుష్మ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు వరంగల్ జిఆర్పి పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news