TGPSC Group-1 Prelims: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్.. ఈ రూల్స్ పాటించాల్సిందే

-

TGPSC Group-1 Prelims: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణకు TGPSC కఠిన నిబంధనలు రూపొందించింది. జూన్ 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. హాల్ టికెట్ A4 సైజ్ ప్రింట్ తీసుకోవాలి.

అందులో ఫోటో సరి గ్గా లేకుంటే గెజిటెడ్ అధికారి చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటేస్ట్ చేసిన మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను రెడీ చేసుకోవాలి. కమిషన్ వెబ్ సైట్ లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్ కు ఇవ్వాలి.

హాల్ టికెట్ తాజా ఫోటోను అతికించాలి.అభ్యర్థి వ్యక్తిగత వివరాలు, గుర్తింపు కార్డులోని వివరాలను సరిపోల్చిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇన్విజిలేటర్ సమక్షంలో అభ్యర్థి హాల్ టికెట్ పై సంతకం చేయాలి. ఫొటోస్, అంతకం విషయంలో ఇన్విజిలేటర్లు సంతృప్తి చెందకుంటే పరీక్షకు అనుమతి ఇవ్వరు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారు. నగలు, ఆభరణాలు తీసుకెళ్లకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news